క్రిష్ బ‌ర్త్ డే.. ప‌వన్ క‌ళ్యాణ్ ఎలా స‌ర్‌ప్రైజ్ చేశాడో తెలుసా?

గ‌మ్యం సినిమాతో త‌న స‌త్తా నిరూపించుకున్న ద‌ర్శ‌కుడు క్రిష్‌..అతి త‌క్కువ స‌మ‌యంలో అద్భుత‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్నాడు. బాల‌కృష్ణ‌తో ఆయ‌న చేసిన గౌత‌మిపుత్ర శాత‌కర్ణి చిత్రాన్ని కేవ‌లం 80 రోజుల‌లోనే పూర్తి చేసి అంద‌రికి షాక్ ఇచ్చాడు. ఇక ఇటీవ‌ల మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌తో చేస్తున్న సినిమాని కేవ‌లం 40 రోజుల‌లో పూర్తి చేశారు. ఇక ప‌వ‌న్ 27వ చిత్రాన్ని కూడా త‌క్కువ స‌మ‌యంలో పూర్తి చేనున్న‌ట్టు తెలుస్తుంది. క్రిష్ స్పీడ్ చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అవాక్క‌వుతున్నాయి.

క్రిష్ ప్ర‌స్తుతం పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏ.ఎమ్‌.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘శివమ్‌’ అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌కు ఆ టైటిల్‌ సరితూగదనే ఆలోచనతో చిత్రబృందం ‘శివమ్‌’గా పేరు మార్చాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ పాత్ర రాబిన్ హుడ్ త‌ర‌హాలో ఉంటుంద‌ని, పీడిత ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే యోధుడిగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. జాక్వెలిన్ ఫెర్నాడేజ్‌ని క‌థానాయిగా ఎంపిక చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కీర‌వాణి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ రోజు క్రిష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా పీఎస్‌పీకే 27 చిత్ర నిర్మాత ఏఎం రత్నం ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా కేక్ క‌ట్ చేయించారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. క్రిష్ కు పుష్ప గుచ్చం పంపించారు. దానిపై హ్యాపీ బ‌ర్త్‌డే క్రిష్ గారు. శుభాకాంక్ష‌లు అంటూ రాసారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ సినిమా పూర్తైన తర్వాత క్రిష్‌తో క‌లిసి ప‌ని చేయ‌నున్నారు