ఇండస్ట్రీ టాక్ : పవన్ ఆ రెండు సినిమాల్లో ఒకటి దసరాకి??

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు రాజకీయాలు పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన్నట్టుగా కనిపిస్తుంది. కాగా రాజకీయాలు కాకుండా తెలుగులో అయితే పలు భారీ సినిమాలు పవన్ చేస్తున్నాడు. కానీ ఈ సినిమాలో ఏది కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. అన్నీ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసినవే దీనితో పవన్ డేట్స్ కోసం నిర్మాతలు గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే ఇప్పటికే ఆలస్యం అయ్యింది.

పైగా ఏపీలో ఎన్నికలు కూడా దగ్గరకి వస్తున్నాయి. దీనితో పవన్ అసలే అందుబాటులో ఉండడు. ఇక దీనితో ఈ చిత్రాలు అన్నీ మళ్ళీ వచ్చే ఏడాదిలోన్ షూట్ స్టార్ట్ చేసుకోనున్నాయి. అయితే ఈ చిత్రాల్లో రెండు సినిమాలు ముందే కంప్లీట్ అవుతాయని తెలుస్తుంది. కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి సినిమాలు ఉన్నాయి.

మరి ఈ రెండు ఎన్నికలు అయ్యిన వెంటనే కంప్లీట్ చేస్తే వచ్చే ఏడాది దసరా రేస్ లో ఈ రెండు సినిమాల్లో ఒకటి అయితే రిలీజ్ కానుంది అని గట్టి బజ్ సినీ వర్గాలు నుండి వినిపిస్తుంది. ఇక హరిహర వీరమల్లు సినిమా కోసం అయితే అసలు చప్పుడే లేదు. మరి చూడాలి ఏ సినిమా మొదట కంప్లీట్ అయ్యి దసరా రేస్ లో రిలీజ్ అవుతుంది అనేది.