పవన్ “ఓజి” అప్పటికి పూర్తయిపోతుందట.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి రాగ తన నుంచి అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు రానున్న రోజుల్లో రానున్నాయి. ఇక ఈ ఏడాదిలోనే ఆల్ మోస్ట్ రెండు సిన్మాలు ఫిక్స్ అయ్యిపోయాయి. వాటిలో ఈ జూలై లో దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన చిత్రం “బ్రో ది అవతార్” మొదటగా రిలీజ్ కి వస్తుండగా..

దాదాపు ఈ ఏడాది డిసెంబర్ రేస్ లో అయితే భారీ చిత్రం తన “ఓజి” ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అయితే రానుంది అని తెలుస్తుంది. కాగా ఈ సినిమా ని దర్శకుడు సుజీత్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ చేస్తుండగా ఆల్రెడీ ఈ సినిమాలో రెండు షెడ్యూల్స్ ని మేకర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేయగా ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ సమాచారం సినిమాపై తెలుస్తుంది.

ఈ సినిమా షూటింగ్ అయితే బహుశా ఈ ఏడాది అక్టోబర్ లోపు మొత్తం పూర్తయిపోతుందట. దీనితో అయితే ఈ సినిమాని డిసెంబర్ కి డెఫినెట్ గా రిలీస్ కావచ్చని తెలుస్తుంది. కానీ అసలు ఈ సినిమా ఎంతవరకు అనుకున్నట్టు పూర్తవుతుంది అనేది అసలు ప్రశ్న. పవన్ ఎలా లేదన్నా జూన్ నుంచే రాజకీయ ప్రచారం చేస్తాడని టాక్ ఉంది.

మరి ఈ టైట్ బిజీ షెడ్యూల్ లో ఎలా తాను ఇప్పుడు సినిమాలు కంప్లీట్ చేస్తాడు అనేది అలా ప్రశ్నగానే మిగిలింది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఆర్ ఆర్ ఆర్ నిర్మాణం సంస్థ డీవీవీ వారు నిర్మాణం వహిస్తున్నారు.