పవన్ “ఓజి”..మాస్ చూపిస్తున్న చిత్ర యూనిట్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ ఏక్షన్ అండ్ పాన్ ఇండియా చిత్రం “ఓజి” ది ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కోసం తెలిసిందే. మరి భారీ హైప్ ఉన్న ఈ చిత్రాన్ని పవన్ ఇపుడు చేస్తున్న అన్ని సినిమాల్లో కూడా దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి షూటింగ్ కంప్లీట్ చేయడం అనేది ఆసక్తిగా మారింది.

కాగా ఈ చిత్రం అయితే ఇప్పుడు పవన్ లేకుండానే పలు కీలక సన్నివేశాలు షూటింగ్ జరుపుకుంటూ ఉండగా మేకర్స్ అయితే ఈ ఉదయమే మరి క్రేజీ అప్డేట్ ని అందించారు. కాగా దీనితో అయితే ఈ చిత్రం మొత్తం 50 రోజుల షూట్ ని కంప్లీట్ చేసుకుందట. అసలు ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఈ రేంజ్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతూ ఉండడం క్రేజీ అంశం అని చెప్పాలి.

దీనితో అసలుకే చిత్ర యూనిట్ కూడా మంచి మాస్ స్పీడ్ లో సినిమాని కంప్లీట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇపుడు పవన్ తన వారాహి యాత్రలో బిజీగా ఉన్నప్పటికీ పవన్ లేని మూడో షెడ్యూల్ స్టార్ట్ చేయగా ఇప్పుడు షూటింగ్ 50వ రోజుకి చేరుకుంది. దీనితో మేకర్స్ దీనికి కూడా అప్డేట్ ఇచ్చారు.

మరి పవన్ అయితే మళ్ళీ ఎపుడు షూటింగ్ లో జాయిన్ అవుతాడు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి లాంటి స్టార్ కాస్ట్ ఈసినిమాలో ఉంది.