టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాల్లో యువ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న మాసివ్ ఏక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “దే కాల్ హిం ఓజి” కూడా ఒకటి. మరి పవన్ బర్త్ డే కానుకగా వచ్చిన వీడియోతో అయితే ఒక్కసారిగా సినిమాపై హైప్ మరింత స్థాయిలో పెరగగా..
ఇప్పుడు షూటింగ్ అయితే నెమ్మదిగా కొనసాగుతుంది. కాగా ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ అయితే తెలుస్తుంది. దీనితో చిత్ర నిర్మాతలు సినిమా తాలుకా బిజినెస్ ని స్టార్ట్ చేసేసారట. మరి మొట్ట మొదట సినిమా బిజినెస్ ని నైజాం ప్రాంతం నుంచి స్టార్ట్ చేయగా..
అక్కడ ఈ సినిమాకి మేకర్స్ ఏకంగా 50 కోట్ల బిజినెస్ నుంచి సినిమాకి స్టార్ట్ చేస్తున్నారట. అయితే ఈ భారీ మొత్తం ఇవ్వడానికి ప్రస్తుతానికి ముగ్గురు పేరు మోసిన డిస్ట్రిబ్యూటర్లు లైన్ లో ఉన్నారనీ రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఓజి లెక్కలు ఊహించని లెవెల్లోనే ఉండేలా ఉన్నాయని చెప్పాలి.
కాగా ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అయితే RRR నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.