గ్లింప్స్ టాక్ : మెంటల్ మాస్ గా ఉన్న పవన్ “ఓజి” వీడియో 

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా అయితే తాను ఇప్పుడు నటిస్తున్న ప్రస్తుత చిత్రాలు నుంచి ఒకో బ్లాస్టింగ్ అప్డేట్ ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా వాటిలో మొదట హరిహర వీరమల్లు నుంచి క్రేజీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా నెక్స్ట్ అయితే అంత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్ “ఓజి” నుంచి కూడా వచ్చేసింది.

కాగా ఈ గ్లింప్స్ ఉన్న అంచనాలు ఇప్పటివరకు బయటకి వచ్చిన పలు పోస్టర్ లు అన్నీ చూసిన వాటికి ఎంత క్రేజ్ వచ్చిందో వాటిని మించేలా ఈ వీడియో ఉందని చెప్పాలి, మొత్తం ముంబై సిటీ లో ప్లాన్ చేసిన ఈ చిత్రం వింటేజ్ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తుంది.

అలాగే మొత్తం కత్తి పట్టుకొని ఉన్న షాట్స్ లోనే చూపించగా సుజీత్ టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అర్జున్ దాస్ వాయిస్ ఎలివేషన్స్ ఏ తుఫాన్ కూడా వాడు నరికిన వాళ్ళ రక్తాన్ని కడగలేకపోయింది అని మళ్ళీ పదేళ్ల తర్వాత అలాంటోడు వస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది అనే ఎలివేషన్స్ అంతా కూడా పవన్ మార్క్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఇది కనిపిస్తుంది.

ఇప్పటి వరకు చాలా మంది గ్యాంగ్ స్టర్స్ గా కనిపించి ఉండొచ్చు కానీ ఈ గ్యాంగ్ స్టర్ వేరేలా ఉన్నాడని చెప్పాలి. అలాగే సంగీత దర్శకుడు థమన్ కూడా మామూలు డ్యూటీ చెయ్యలేదు. దీనితో ఓ కంప్లీట్ మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ గా ఈ వీడియో ఉందని చెప్పడంలో డౌట్ లేదు. 
Hungry Cheetah  - OG Glimpse | Pawan Kalyan | Sujeeth | Thaman S | DVV Danayya