ఇండస్ట్రీ టాక్..పవన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ చిత్రం.?

ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో తన ఫ్యాన్ డైరెక్టర్స్ ఇద్దరితో పవన్ వర్క్ చేస్తున్నాడు. మరి ఈ చిత్రాలలో యంగ్ దర్శకుడు సుజీత్ తో ప్లాన్ చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం “ఓజి” కూడా ఒకటి.

మరి ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ లో మంచి హైప్ సెట్ చేసుకోగా పవన్ కూడా దాదాపుగా రెండు షెడ్యూల్స్ ని తాను కంప్లీట్ చేయడం విశేషం. మరి సూపర్ ఫాస్ట్ గా ఈ సినిమా కంప్లీట్ అవుతుండగా పవన్ కూడా మొదట ఈ సినిమా కంప్లీట్ చెయ్యాలనే ప్రాధాన్యతతో ఉన్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి పవన్ ఎందుకు ఈ సినిమాకి మొదటి ఛాయిస్ ఇస్తున్నారో కానీ ప్రస్తుతం ఈ రూమర్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే మరో భారీ చిత్రం హరిహర వీరమల్లు కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ అయితే పవన్ ఓజి కి ప్రిఫరెన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.

మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో చూడాలి. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎలాగో ఈ సినిమా ఈ ఏడాది లోనే రిలీజ్ అంటున్నారు కాబట్టి చూడాలి ఏమవుతుందో అనేది.