సుజీత్ సినిమాకి పవన్ రికార్డు రెమ్యునరేషన్.?

ప్రెజెంట్ టాలీవుడ్ లో మంచి క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ లలో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న చిత్రం కాగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్ననే ఈ భారీ సినిమా అత్యంత ఘనంగా లాంఛ్ కాగా అక్కడ కి వచ్చిన అనేక మంది సినీ సెలెబ్రెటీ లు సమక్షంలో ఈ చిత్రం స్టార్ట్ అయ్యింది.

అయితే ఈ సినిమాపై ఈ కొన్ని రోజుల్లోనే అనేక గాసిప్స్ బయటకి రాగా ఈ చిత్రంపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకోనున్న రెమ్యునరేషన్ కోసం టాక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం కోసం పవన్ సుమారు 60 రోజులకి పైగా డేట్స్ ని ఇవ్వగా ఈ అన్నిటికి కలిపి 60 నుంచి 70 కోట్ల మేర మధ్య రెమ్యునరేషన్ అయితే ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడట.

అయితే కొందరు ఈ సినిమాకి పవన్ కేవలం 30 రోజులే కేటాయించాడు అని రూమర్స్ ఉన్నాయి కానీ నిజానికి పవన్ 60 రోజులకి పైగానే డేట్స్ ఇచ్చాడట. దీనితో పవన్ రెమ్యునరేషన్ ఈ సినిమాకి ఈజీగా రోజుకి 1 కోటి చొప్పున 60 కోట్లు అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని భారీ నిర్మాణ సంస్థ “RRR” ప్రొడక్షన్ హౌస్ డీవీవీ వారు నిర్మాణం వహిస్తుండగా సుజీత్ ఈ సినిమాని గన్స్ అండ్ లవ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఎస్ పేరు కూడా నిన్ననే ఫైనల్ అయ్యిన సంగతి తెలిసిందే.