“ఓజీ” విషయంలో సెన్సేషనల్ ప్రామిస్ ఇస్తున్న యూనిట్.!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో క్రేజీ ఎలిమెంట్స్ తో భారీ ఏక్షన్ డ్రామాగా ప్లాన్ చేసిన సినిమా “ఓజీ” ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ కూడా ఒకటి. మరి ఈ చిత్రం షూటింగ్ అయితే బ్రిస్క్ పేస్ లో ఓ రేంజ్ లో కంప్లీట్ అవుతుండగా భారీ అంచనాలు అయితే అలా నెలకొల్పుకొని కొనసాగుతుంది.

ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గానే చిత్రం షూటింగ్ ముంబై లో స్టార్ట్ కాగా ఇప్పుడు లేటెస్ట్ గా దీనిపై చిత్ర యూనిట్ బిగ్ అప్డేట్ అందించారు. ఇపుడు తాము సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశామని తెలిపారు. అంతే కాకుండా ఫ్యాన్స్ కి అయితే సెన్సేషనల్ ప్రామిస్ ని కూడా ఇవ్వడం కేజ్రీగా మారింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మళ్ళీ మరొక్క సారి మీరు చూస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దీనితో ఈ చిత్రం విషయంలో అభిమానులు పెట్టుకున్న అంచనాలు అన్నిటికి మించే ఈ సినిమా ఉంటుందేమో అని చెప్పాలి.

ఇక ఈ చిత్రంలో నెక్స్ట్ షెడ్యూల్ ని అయితే పూణే స్టార్ట్ చేయగా ఇందులోనే హీరోయిన్ ప్రియాంక మోహన్ తో అయితే ఓ సాంగ్ ని కూడా ప్లాన్ చేశారట. అలాగే కొంత టాకీ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారట. మరి థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని యంగ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.