తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుసగా నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తన పిల్లల గురించి ఒక వార్త వినబడుతోంది. రష్యాకు చెందిన ఈమె తన పిల్లల చదువు కోసం ఏకంగా సింగపూర్ వెళ్లి సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సింగపూర్ లేదా మరి ఏ దేశంలోనైనా తన పిల్లలను చదివించాలనీ అందుకోసమే ఆ దేశంలోనే తన భార్య సెటిల్ కావాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడుతుంటే పవన్ వ్యతిరేకించడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చాలా మంది పవన్ కళ్యాణ్ ని పిల్లలకు ఒక న్యాయం పేద పిల్లలకు ఒక న్యాయమా అంటూ కామెంట్ చేశారు. తన పిల్లలను మంచి మంచి కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో విదేశాలలో చదవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కి వ్యతిరేకం కాదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి తను సానుకూలంగా ఉన్నారని,అయితే బలవంతంగా పిల్లలకిఇష్టం లేకపోయినా వారిని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించ వద్దనీ వారి ఇష్టప్రకారం వారి తల్లిదండ్రుల ఇష్టప్రకారమే వారిని ఇంగ్లీష్ మీడియం లేదా తెలుగు మీడియంలో చదివే అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ కోరారు అంటూ పవన్ అభిమానులు ఘాటుగా స్పందించారు.