పవన్ కళ్యాణ్ వైబ్రెంట్ లుక్స్… అదిరింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయ కార్యక్రమలాపాలు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. మార్చి 14న మచిలీపట్నం వేదికగా జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ జరగనుంది. అయితే దీనికి ముందస్తుగా నాలుగు రోజుల షెడ్యూల్ ని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం మంగళగిరిలో బీసీ సంఘాల నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నాడు. అయితే ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి నూజివీడు చేరుకున్నారు.

అయితే రాజకీయ పర్యటనలకి వెళ్ళినపుడు పవన్ కళ్యాణ్ కామన్ గా వైట్ అండ్ వైట్ లో ఎక్కువగా వెళ్తూ ఉంటారు. లేదంటే క్యాజువల్ డ్రెస్సింగ్ లో వెళ్తారు. అయితే ఈ సారి మాత్రం డిఫరెంట్ స్టైల్ లో బ్లాక్ కలర్ టీ షర్ట్, ఆర్మీ జవాన్లు వేసుకునే ఫ్యాంట్ ధరించి బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని పవర్ ఫుల్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఈ లుక్స్ కి సంబందించిన ఫోటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ రేర్ గా ఇలాంటి కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఉంటారు.

ఖాకీ డ్రెస్ తాను వేసుకోవడానికి కారణం స్ఫూర్తి పొందడానికి అని చాలా సార్లు చెప్పారు. అయితే ఇప్పుడు ఖాకీ ఫ్యాంట్ వేసుకొని కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ని హరీష్ శంకర్ స్టార్ చేశారు.

ఈ నేపధ్యంలో షూటింగ్ ముగించుకొని అదే కాస్ట్యూమ్స్ లో పవన్ కళ్యాణ్ మంగళగిరి పయనం అయినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఎక్కువగా పోలీసులు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ లో పవన్ కళ్యాణ్ కనిపించాడని టాక్ వినిపిస్తుంది.ఏది ఏమైనా ఈ కాస్ట్యూమ్స్ లో పవన్ కళ్యాణ్ లుక్ చాలా వైబ్రెంట్ గా ఉందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది.