పవన్ కళ్యాణ్ ‘భగత్ సింగ్’ టైటిల్ మారుతోందా.?

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌తో ఓ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వుంది.

సింహా కోడూరి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వస్తున్న ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. దాంతో, ‘ఉస్తాద్’ పేరు మార్మోగిపోతోంది. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ మార్చే యోచనలో వున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయ్.

నిజానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ పట్ల ఫ్యాన్స్ కూడా అంత సంతృప్తికరంగా వున్నట్లు లేరు. హరీష్ మొదట పెట్టిన ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్‌కే ఫ్యాన్స్ సుముఖంగా వున్నారు.

అయితే, ‘భవదీయుడు భగత్ సింగ్’ ఒరిజినల్ స్టోరీ. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ మూవీ. తమిళ ‘తెరి’ మూవీకి రీమేక్‌గా రూపొందుతోన్న సినిమా ఇది.

ఏది ఏమైనా, తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాకి టైటిల్ మార్చాల్సిన ఆవశ్యకత ఎక్కువగానే వున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం చేస్తారో.!