పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ రహస్య భేటీ.!

రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టుకుని పవన్ కళ్యాణ్ తాజాగా హైద్రాబాద్ వచ్చారు. హైద్రాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్‌ని కొందరు నిర్మాతలు, దర్శకులు కలిశారట. పలు సినిమా ప్రాజెక్టుల గురించి ముచ్చటించారట. అయితే, హరీష్ శంకర్ మాత్రం సీక్రెట్‌గా పవన్ కళ్యాణ్‌ని కలిశాడనీ అంటున్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటీ.? అని తెలుసుకోవడానికే హరీష్ శంకర్, పవన్ కల్యాణ్‌ని కలిశాడా.? లేదంటే, ఇంకేమైనా కారణాలున్నాయా.? అని ఆరా తీస్తున్నారు.

అయితే, పవన్‌ని కలిస్తే, ఒక్క ఫోటో అయినా సోషల్ మీడియాలో షేర్ చేయకుండా వుంటాడా.? హరీష్ శంకర్. కలిస్తే అంత సీక్రెట్ ఎందుకు.? ఒకవేళ కలవలేదే అనుకోండి.. ఈ గాసిప్ ఎందుకు బయటికొస్తుంది.? అయినా పాపం హరీష్ శంకర్.! చాన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పట్టాలెక్కింది. అయినా కానీ, ముందుకు కదలడం లేదు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో అతి వేగంగా పూర్తి చేయాల్సిన సినిమా ‘ఓజీ’. పవన్ ఫస్ట్ ప్రయారిటీ ఈ సినిమానే ప్రస్తుతం. మరి, ‘ఉస్తాద్’కి టైమ్ ఎలా కేటాయిస్తాడో.!