సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమా.?

‘పవన్ కళ్యాణ్ ఓకే అనాలిగానీ.. ఆయనతో సినిమాలు చేయడానికి నా దగ్గర 100 కథలున్నాయ్..’ అంటూ కొన్నాళ్ళ క్రితమే దర్శకుడు, నటుడు సముద్రఖని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘బ్రో’ సినిమా కోసం సముద్రఖని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు.

తెలుగులో దర్శకుడిగా ఆయనకి ఇదే తొలి సినిమా. అయితే, దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనా సహకారం అందిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్‌తో ఓ కొత్త ప్రాజెక్టు విషయమై గ్రీన్ సిగ్నల్ పొందాడట సముద్రఖని. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. అతి త్వరలో సినిమా ప్రారంభమైపోవచ్చని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ, అదంత తేలికైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా పూర్తి చేయాలి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతీ చూడాలి. ‘హరిహర వీరమల్లు’ సంగతి సరే సరి. కానీ, ఓ 30 రోజులు డేట్లు ఇస్తే, సినిమా పూర్తి చేసేస్తానంటూ పొలిటికల్ సబ్జెక్ట్ చేతపట్టుకుని కాన్పిడెంట్‌గా సముద్రఖని వున్నాడట. ఏమవుతుందో మరి.!