పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టార్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంకా ఆరుళ్ మోహన్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని సుజిత్ తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రాన్ని గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ తో కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తనకి సంబందించిన సీక్వెన్స్ అన్ని కూడా వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నెవ్వర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడనే టాక్ వినిపిస్తోంది. గ్యాంగ్ స్టార్ గా ఇది వరకు బాలు, పంజా సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించాడు.
అయితే ఓజీ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ సరికొత్తగా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. అలాగే ఈ సినిమాపై ఫ్యాన్స్ కి కూడా చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ ఏడాదిలోనే డిసెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారనే మాట వినిపించింది. ఇదిలా ఉంటే తాజాగా మరో టాక్ తెరపైకి వచ్చింది. ఓజీ సినిమాని క్రిస్మస్ వీక్ లో రిలీజ్ చేయాలని సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నారంట.
దానికి తగ్గట్లుగానే వీలైనంత వేగంగా మూవీ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నాటికి మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా సుజిత్ పెట్టుకున్నారంట. క్రిస్మస్ వీకెండ్ లో కి గ్రాండ్ గా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ కావడంతో కచ్చితంగా సినిమాని గ్రాండ్ గా పవర్ స్టార్ అభిమానులకి నచ్చే విధంగా ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు.
ఇక జులైలో బ్రో అవతార్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇక డిసెంబర్ లో ఓజీ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్ ని ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడింటి తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.