పవన్‌ కల్యాణ్‌ ‘ఓజి’ కొత్త పోస్టర్‌ విడుదల!

టాలీవుడ్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’. ‘సాహో’ ఫేం సుజీత్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మూవీ షూటింగ్‌ కొన్ని రోజులు వాయిదా పడింది.

అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌ లుక్‌తో పాటు గ్లింప్స్‌ విడుదల చేయగా అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి సంగీత దర్శకుడు తమన్‌ కొత్త పోస్టర్‌ను పంచుకున్నాడు. ఇక ఈ పోస్టర్‌లో కత్తి పట్టుకుని ప్రత్యర్థులను తెగనరుకుతున్నట్లు పవన్‌ కనిపిస్తున్నాడు.

ఇందులో పవన్‌ లుక్‌ చాలా పవర్‌ ఫుల్‌గా ఉంది. ఇక యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తుంది. అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించ నున్నాడు. మరోవైపు, పవన్‌.. క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.