అటకెక్కిపోయిన సినిమాని, అటక మీద నుంచి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయా.? అంటే, ‘ఓజీ’ సినిమా విషయంలో ఈ గాసిప్స్ నిజమే కావొచ్చేమో.! పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.
నిజానికి, చాలా వేగంగానే సినిమా షూటింగ్ జరిగింది కూడా. కొద్ది రోజులు షూట్ బ్యాలెన్స్ వుంది.. అది గనుక జరిగిపోయి వుంటే, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసేసుకుని, సినిమాని విడుదల చేసేసేవారే.
కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా వున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన గ్యాప్, కంటిన్యూ అయిపోయింది. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ‘ఓజీ’ బూజు దులపాలనే ఆలోచనలో మేకర్స్ వున్నట్లు తెలుస్తోంది.
ఎటూ రెండు పార్టులు అయితే బావుంటుందన్న చర్చ ఇది వరకే జరిగింది. దానికి తగ్గట్టుగానే ఓ పార్ట్‌ని త్వరలో విడుదల చేసేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన చేస్తున్నారట మేకర్స్.
అలా చేయాలన్నా ఓ వారం పది రోజులపాటు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించాల్సి వుంటుందట. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ నుంచి ఆ టైమ్ దొరక్కపోవచ్చు. ఏమో, ఏదన్నా అద్భుతం జరిగితే, ‘ఓజీ’ వచ్చే ఎన్నికల ముందర విడుదలయ్యే అవకాశం వుందేమో.!