మొదటిసారిగా మెగా బ్యానర్ లో పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్.. సాధ్యమయ్యే పనేనా?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారటంలో ఏమాత్రం సందేహం లేదు . అయితే పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానుల కోసం ఏం చేయటానికైన వెనకాడడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హర హర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ తేదీ రోజురోజుకీ సమీపించటంతో ఒకవైపు ఎలక్షన్స్ మీద దృష్టి పెడుతూనే మరొకవైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హర హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మరొక రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించనున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అయితే సముద్రఖని సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం కొన్ని రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అకౌంట్ లో మరొక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మెగా కుటుంబానికి చెందిన కొణిదెల బ్యానర్ లో పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకులుగా ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో పాటు భీమ్లా నాయక్ సినిమా దర్శకుడు సాగర్ కె. చంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి స్టోరీతో సిద్ధంగా ఉన్నారని అయితే పవన్ కళ్యాణ్ కూడా సాగర్ వద్ద ఉన్న స్టోరీ లైన్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే తొందరలోనే ఈ విషయం గురించి ఒక క్లారిటీ రానుంది.ఇలా ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి ఎప్పటికీ భవదీయుడు భగత్ సింగ్ సినిమాని పక్కన పెట్టారని వార్తలు వస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో మరొక సినిమా చేయడం ఎంతవరకు సాధ్యమయ్యేనని పలువురు భావిస్తున్నారు.