పవన్ కళ్యాణ్ సినిమాలు.. ఓ జిమ్మిక్కు.!

పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన సినిమాలు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. కానీ, ఆయా సినిమాల అప్డేట్స్ ఎలా వస్తున్నట్టు.? కొన్నిటికి రిలీజ్ డేట్లు.. కొన్నిటికి ప్రోమోస్ వస్తాయంటూ ప్రకటనలు.. అసలేం జరుగుతోందబ్బా.? అని, సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మూడు సినిమాల్లో రెండు సినిమాల షూటింగ్ గట్టిగానే జరిగింది. ఓ సినిమా షూటింగ్ జస్ట్ స్టార్ట్ అయి ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే, అక్కడికి దగ్గర్లో సెట్ వేసి, సినిమాల షూటింగులు పూర్తి చేసేస్తామని ఆ మధ్య ఓ దర్శకుడు సెలవిచ్చాడు.

అతనెవరో కాదు, దర్శకుడు హరీష్ శంకర్. కానీ, అతని సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దాదాపుగా ఆగిపోయింది. అస్సలు ముందుకు కదలడంలేదు. రేపో మాపో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కూడా ఏదో ఒక అప్డేట్ వచ్చేయొచ్చు.

అసలేంటిదంతా.? ‘హరి హర వీర మల్లు’ సినిమా అటకెక్కేసిందన్న ప్రచారం నేపథ్యంలో, ‘త్వరలో ప్రోమో’ అనేసింది చిత్ర యూనిట్. ఆ ప్రోమో ఎప్పుడొస్తుందన్నదానిపై క్లారిటీ లేదు.

అసలు ‘ఓజీ’ సెప్టెంబర్ నెలలో రిలీజ్.. అని డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. అదెలా సాధ్యమబ్బా.? ఈ విషయాలపై ఆరా తీస్తే, ఇదంతా ఓ మ్యాజిక్కు.. జిమ్మిక్కు.. అని తేలింది.! అభిమానులు ఎన్నికల ముందర ఏమాత్రం డిజప్పాయింట్ అవకుండా ఈ ప్రకటనలొస్తున్నాయట. అద్గదీ అసలు సంగతి.