పవన్ కళ్యాణ్ సగం సహకారం.?

‘బ్రో’ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్, వంద శాతం మనసు పెట్టలేదా.? దాదాపుగా ఇదే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్, ‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. 5‌‌0 నుంచి 75 రోజులపాటు తాను షూట్‌లో పాల్గొనాల్సి వున్నా, ఇరవై రోజుల్లోనే పని పూర్తయ్యిందన్నది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట.

అంటే, యాభై శాతం కాదు.. ముప్ఫయ్ శాతం మాత్రమే, పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తన ఎఫర్ట్ పెట్టాడని అనుకోవాల్సి వుంటుంది. అయితే, ఇదేదీ నిజం కాదట. పవన్ కళ్యాణ్, కాస్త ఎక్కువగానే ‘బ్రో’ మీద ఫోకస్ పెట్టాడు.

ప్రచారం కోసం ఏం చెప్పినా.. అదంతా ట్రాష్.! స్క్రిప్ట్ దగ్గర్నుంచి, స్టైలింగ్.. అలాగే సినిమాటోగ్రఫీ.. యాక్షన్ ఎపిసోడ్.. ఇలా అన్నీ పవన్ కళ్యాణ్ చూసుకున్నారుట. వెరీ వెరీ స్పెషల్ ఎంటంటే, తన పాత పాటల్ని తానే రీ-క్రియేట్ చేయడమన్న ఆలోచన కూడా పవన్ కళ్యాణ్‌దేనని తెలుస్తోంది.

ఈ విషయంలో పవన్ – త్రివిక్రమ్ మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చిందట. నిజమేనా.? నమ్మొచ్చా.?