పవన్ కళ్యాణ్ నిర్మాతలకి భరోసా.!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా వున్నారు. అందులో ఒక్కటి మాత్రం.. కొంత అనుమానం.! అదే ‘హరిహర వీరమల్లు’.! ‘వినోదియ సితం’ రీమక్ వ్యవహారానికొస్తే, పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోపక్క, ‘ఓజీ’ షూటింగ్ జరుగుతోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పట్టాలెక్కేసింది.

ఏక కాలంలో నాలుగు సినిమాలు చేయడమంటే చిన్న విషయం కాదు. పైగా, పొలిటికల్ కమిట్మెంట్లు కూడా వున్నాయ్. అయితే, పొత్తుల వ్యవహారాల కారణంగా, పవన్ కళ్యాణ్‌కి కొంత ఎక్కువ వెసులుబాటు దొరుకుతోందిట.

నిర్మాతలకూ కొంత ఉపశమనం కలుగుతోందని తెలుస్తోంది. రాజకీయాల సంగతెలా వున్నా, సినిమాలకు పూర్తి కమిట్మెంట్ ఇచ్చాడట పవన్ కళ్యాణ్. దాంతో, అభిమానులు.. ఒకింత భరోసాగా ఫీల్ అవుతున్నారు.

అయితే, ఇదంతా జస్ట్ విజయదశమి వరకేనని తెలుస్తోంది. ఆ తర్వాత సంగతేంటి.? అప్పటికల్లా అన్నీ పూర్తయిపోతాయేమో.. షూటింగ్స్ పరంగా.!