రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన పవన్ కళ్యాణ్.. అయినా కూడా సినిమా చేసేందుకు క్యూ కడుతున్న నిర్మాతలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నటుడు ఈయన గురించి పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఈయనకు ఉన్నంత ఫాలోయింగ్ మరెవరికి ఉండదు. అంత క్రేజ్ ఉన్న హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.1971 సెప్టెంబర్ 22న జన్మించారు.

పవన్ కళ్యాణ్ 1996 లో అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సినిమాలు చేస్తూ సినీ రంగంలో ఒక అగ్ర నటుడిగా స్థానం, పేరు పొందారు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా చిరంజీవి సినిమాలకు స్వయంగా తానే కొన్ని ఫైట్లు సెట్ చేసినట్టు సమాచారం.

2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలో రాణిస్తున్నారు. కుల,మత భేదం అనే తారతమ్యాలు లేకుండా అందరినీ కలుపుకొని న్యాయం జరిగేలా పోరాడుతున్నారు. ఒకవైపు సినిమా రంగం, మరొకవైపు రాజకీయం రంగంలో తనదైన శైలిలో ముందుకు దోసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రికార్డులు సృష్టించి విజయం సాధించడంతో తనకు తానే పోటీ అంటూ భారీగా రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తుంది. వకీల్ సాబ్ సినిమాకు దాదాపు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఇంకాస్త రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తుంది.

ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, డైరెక్టర్ హరి శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి భగతీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి దీనికోసం ఏకంగా 60 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లుగా సమాచారం. ఇలా పాండమిక్ టైంలోనూ కలెక్షన్లు తగ్గకుండా తన క్రేజ్ స్థాయి బాగా పెరిగిందని, స్టామినా బయటపడి దాదాపు అరడజన్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు క్యూ కడుతున్నారని తెలుస్తుంది.