ఆరడుగుల బుల్లెట్.. ధైర్యం విసిరిన రాకెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పేరు చెబితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు పవన్. రాజకీయాలతో బిజీగా ఉండడం వలన రెండేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం మియాపూర్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.
ఎంత స్టార్ డం వచ్చిన కూడా పవన్ చాలా సింపుల్‌గా ఉంటారు. ఖరీదైన దుస్తులు,లగ్జరీ కార్లు వంటివి ఆయనకు అస్సలు పడవు. పుస్తకాలు లేదంటే సినిమాలతోనే ఆయన ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఈ రోజు వకీల్ సాబ్ షూటింగ్ కోసం మియాపూర్ వెళ్ళాల్సిన పవన్ మాదాపూర్ నుండి మెట్రో రైల్‌లో ప్రయాణించారు. పవన్ ని చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. మీడియా ప్రతినిధులు పవన్‌ని తమ కెమెరాలో బంధించారు. పవన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, ఆయన చేతికి ఉన్న వాచ్ హాట్ టాపిక్‌గా మారింది.
పవన్ చేతికి ఉన్నది రోలెక్స్ వాచ్ కాగా, దీని ఖరీదు అక్షరాల రూ.40 లక్షలు. సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే పవన్ అంత ఖరీదైన వాచ్ ధరించాడా అని నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అయితే పవన్ ఫోటోలలో వకీల్ సాబ్ గెటప్‌లో కనిపిస్తుండగా, పాత్రలో భాగంగా అంత కాస్ట్‌లీ వాచ్ ధరించి ఉంటాడని కొందరు మద్దతు పలుకుతున్నారు. గతంలో ఓ సారి పవన్ కళ్యాణ్ వేసుకున్న చెప్పుల గురించి సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ బాగానే రచ్చ చేశారు.చెప్పుల కోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాడా అంటూ విమర్శలు చేశారు.