భీమ్ల నాయక్ సినిమా కోసం మొదటగా సంప్రదించింది పవన్ కళ్యాణ్ ని కాదా..?

‘పవన్ కళ్యాణ్’.. ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో పూనకాలు వస్తాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆరాధ్య దైవంగా నిలిచాడు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన అభిమానులు ప్రాణాలు త్యాగం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారంటే ఆయనకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎంతోమంది ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ తన అకౌంట్ లో వేసుకున్నాడు.

“అయ్యప్పనుమ్ కోషియమ్” అనే మలయాళీ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ప్రతి నాయకుడిగా దగ్గుబాటి రానా పవర్ఫుల్ పాత్రలో నటించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హర హర వీరమల్లు” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఎన్నికలు సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేయటానికి దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో భీమ్లా నాయక్ సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ఇటీవల ప్రారంభమైన అన్ స్టాపబుల్ సీజన్ 2 రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో పాటు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో బాలకృష్ణ భీమ్లా నాయక్ సినిమా గురించి ప్రస్తావిస్తూ ..ఈ సినిమా కోసం మొదటగా పవన్ కళ్యాణ్ కాకుండా మరొక హీరోని అనుకున్నట్లు తెలుస్తోంది..అంటూ ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నకు నాగవంశీ ఏం సమాధానం చెప్పాడో తెలియాలంటే కొంతకాలం ఎదురుచూసి అన్ స్టాపబుల్ సీజన్ 2 రెండవ ఎపిసోడ్ చూడాల్సిందే.