వకీల్ సాబ్ సినిమాకు భారీ ఆఫర్

Vakeel Saab Teaser - Pawan Kalyan

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రముఖులు ఈ సినిమా కోసం ఆసక్తిగా వేయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాపై ఒక లుక్కేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక సినినకు సంబంధించిన బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా మొదలైనట్లు తెలుస్తోంది.

pawan kalyan charges huge remunirations for his new movies
దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా వస్తున్నప్పటికీ సినిమాపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక సినిమాపై పెరుగుతున్న బజ్ చూస్తుంటే బాక్సాఫీస్ ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయని అర్ధమవుతోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ కోసం టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ గట్టిగానే పోటీ పడుతున్నాయి.

సినిమా శాటిలైట్ హక్కుల కోసం 15కోట్లకు పైగానే ఆఫర్స్ వస్తున్నాయట. మొదట జెమిని టెలివిజన్ ఛానెల్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు రూమర్స్ రాగా ఆ తరువాత జీ తెలుగు రంగంలోకి దిగి 15కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. దాదాపు డీల్ క్లోజ్ అయినట్లు టాక్ అయితే వస్తోంది. చూడాలి మరి వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో..