వచ్చేసింది… పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్.. రికార్డుల మోత మోగాల్సిందే ఇక

vakeel saab motion poster

పవన్ కల్యాణ్.. టాలీవుడ్ లో ఎప్పటికైనా నెంబర్ వన్ హీరో. ఆయన సినిమాలు చేసినా.. చేయకపోయినా ఆయనే నెంబర్ వన్. నెంబర్ వన్ పొజిషన్ ను కాదని.. ఆయన రాజకీయాల్లోకి వెళ్లారు. అయినప్పటికీ ఆయన నెంబర్ వన్ పొజిషన్ అలాగే ఉంది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన మళ్లీ తన ఫ్యాన్స్ ను అలరించడం కోసం మేకప్ వేసుకుంటున్నారు. ఇప్పటికే మూడు సినిమాలాకు సైన్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కు పండుగలే పండుగలు.

pawan kalyan vakeel saab motion poster released
pawan kalyan vakeel saab motion poster released

వరుసగా పవన్ మూడు సినిమాలు చేయడం అనేది గొప్ప విషయం. అందులోనూ అన్ని పెద్ద ప్రాజెక్టులే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చిందట. ఆ సినిమా పోస్టర్, పాటను ఇప్పటికే విడుదల చేయగా.. వాటికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమాకు సంబందించి ఏ అప్ డేట్ రాలేదు.

కానీ.. తాజాగా పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. అందులో పవన్ చూస్తూ గూస్ బంప్స్ రావడమే. ఇన్నేళ్లు ఎదురు చూసిన పవన్ ఫ్యాన్స్ కు ఇంత ఖుషీ వార్తను అందించారు. పవన్ ఫ్యాన్స్ కు ఏది కావాలో అదే చూపించారు. ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుంది.. అనడానికి ఈ మోషన్ పోస్టరే ఉదాహరణ. 

లాయర్ కోట్ వేసుకొని పవన్ కల్యాణ్ కుర్చీ మీద కాలు పెట్టి లా పుస్తకాన్ని చేతుల్లో పట్టుకొని నిలబడిన తీరు చూసి పవన్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.

pawan kalyan vakeel saab motion poster released
pawan kalyan vakeel saab motion poster released

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది కానీ.. కరోనా వల్ల షూటింగ్ లేట్ అయింది. ఈ సినిమా బాలీవుడ్ మూవీ పిక్ సినిమాకు రీమేక్.

ఇప్పటికే పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా #HBDPawanKalyan అనే హ్యాష్ టాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది ఈ హ్యాష్ టాగ్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ గురించే… పవన్ బర్త్ డే గురించే.

ఇక.. పవన్ మిగితా సినిమాల అప్ డేట్స్ కూడా ఈరోజే రానున్నాయి. క్రిష్ తో కలిసి పవన్ నటించే సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా ఈరోజే రానుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ మరో సినిమా అప్ డేట్ రానుంది. 

పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఇన్ని సర్ ప్రైజ్ లు ఇస్తుండటంతో వాళ్లు ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. 

Vakeel Saab Motion Poster - Pawan Kalyan | Sriram Venu | Thaman S