పవన్ – త్రివిక్రమ్.. మరో మల్టీస్టారర్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సలహాలతోనే ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుంటున్నారు అనే టాక్ అయితే ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తుంది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ ను కలవాలి అంటే ముందుగా త్రివిక్రమ్ ను సంప్రదించాలి అనే వాస్తవమే. నిజానికి పవన్ కళ్యాణ్ ఏ కధ సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా ముందుగా దర్శకులు రచయితలు త్రివిక్రమ్ తో చర్చించాల్సిందే.

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఏది సెట్ అవుతుందో అనే విషయంలో కూడా త్రివిక్రమ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలన మొత్తం త్రివిక్రమ్ కు సినిమాలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు పవన్. ఇక ఈ విషయంలో ఫ్యాన్స్ కొంత అసంతృప్తితో ఉన్నారు.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ మరో కథను ఫైనల్ చేసినట్లుగా ప్రచారాలు స్టార్ట్ అయ్యాయి. ఇదివరకే సుధీర్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడు అని ఒక టాక్ వచ్చింది. నిజానికి రావణాసుర సినిమా ప్రమోషన్స్ లో కూడా ఆ దర్శకుడు అది నిజమే అని కాకపోతే ఇంకా ఫైనల్ కాలేదు అని అన్నాడు. ఇక త్రివిక్రమ్ ఈ కాంబినేషన్లో కలిపి అందులో మరొక హీరోను కూడా జత చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇక మరో హీరోగా మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన అవకాశం ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఆ ప్రాజెక్టుకు స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా మరొక క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ తో పవన్ వినోదయ సీతం సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి పవన్ వర్క్ కూడా ఫినిష్ అయింది. ఇక త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి వైష్ణవ్ తేజ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.