Home Entertainment పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ సినిమాకి ప్లాప్ డైరెక్టర్?

పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ సినిమాకి ప్లాప్ డైరెక్టర్?

బండ్ల గణేష్ లేట్ గా వచ్చినా పవన్ కళ్యాణ్ తో సినిమా పట్టేసాడు. ఎంతో మంది నిర్మాతలు క్యూలో ఉండగా గణేష్ తన దేవుడు పవన్ కళ్యాణ్ దగ్గర వరం పొందగలిగాడు. ఇదే విషయాన్ని బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా మనకు తెలియజేశాడు కూడా.

Pawan Kalyan

సినిమా అయితే ఖాయం అయ్యింది కానీ దర్శకుడు మీద సస్పెన్స్ కొనసాగుతుంది. ఆ విషయం మీదనే ఈ రోజు ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొన్ని హింట్స్ ఇచ్చాడు నిర్మాత బండ్ల గణేష్. ఇంతకముందు పవన్ కళ్యాణ్ తో చేసిన దర్శకులు ఈ సినిమాకు పని చెయ్యరని చెప్పుకొచ్చారు. అంటే అందరూ అనుకున్నట్టు త్రివిక్రమ్ కానీ డాలీ కానీ ఈ సినిమా కు దర్శకత్వం చేయడం లేదనేది అర్ధమైంది.

ఇక పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా అంటే ఇప్పుడున్న స్టార్ దర్శకుల్లో కొరటాల శివ, అనిల్ రావిపూడి, సుజీత్ వున్నారు. కొరటాల శివ మరియు అనిల్ రావిపూడి సినిమాలు లైనప్ చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం వీరికి సాధ్యం కాకపోవొచ్చు. పాన్ ఇండియా సినిమా కాబట్టి అటువంటి సినిమా అనుభవం వున్న సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ఫిలిం నగర్ టాక్.

అయితే ఈ విషయాన్నీ బండ్ల గణేష్ నేరుగా చెప్పకుండా, తన దేవుడు పవన్ కల్యాణే ఈ చిత్ర దర్శకుడి గురుంచి ప్రకటిస్తారు అని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan 1 | Telugu Rajyam

సుజీత్ చిరంజీవితో సినిమా చెయ్యవలిసివుంది. కానీ ఆ సినిమా ఎందుకో రద్దయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుజీత్ పవన్ కళ్యాణ్ సినిమా కథ రెడీ చెయ్యడం కోసం మెగాస్టార్ సినిమా మీద ద్రుష్టి పెట్టాలకపోయారట. అందుకే మెగా కాంపౌండ్ కూడా పవన్ కళ్యాణ్ కి మంచి సినిమా వస్తే చాలానే ఉద్దేశం తో సుజీత్ ని మెగా కాంపౌండ్ నుండి పవర్ స్టార్ కోసం వదిలేశారంట. గతంలో బన్నీ కూడా ఇలాగే వకీల్ సాబ్ కోసం వేణు శ్రీరామ్ ని త్యాగం చేసారు. మెగా ఫామిలీ అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మంచి హిట్ పడాలనే కసితో ఉన్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

Related Posts

బాలీవుడ్ అయితే ఏంటి.. మహానటి తగ్గట్లేదుగా!

మహానటి సినిమాతో తన హావభావాలతో ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన క్యూట్ గర్ల్ కీర్తి సురేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం మహేష్ బాబు...

అక్కడ.. మరో మాస్టర్ కావాలట

కరోనా లాక్ డౌన్ తరువాత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న చిత్రం మాస్టర్. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో పాజిటివ్ టాక్ ను అందుకోకపోయినా...

వరుణ్ తేజ్ బాక్సింగ్.. స్పెషల్ అప్డేట్ రెడీ!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా రోజులయ్యింది. చివరగా 2019లో గద్దల కొండ గణేష్, F2 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న వరుణ్ ఆ తరువాత...

ప్రభాస్, యష్ కాంబో.. కొంచెం చూడండి బయ్యా

బాహుబలితో సెట్ చేసిన ఒక బిగ్గెస్ట్ రికార్డుతో ప్రభాస్ పాన్ ఇండియా అనే దారిని మరింత పెద్దది చేయగా KGF చాప్టర్ 1తో యష్ కూడా మరో దారిని సెట్ చేశాడు. ఇటీవల...

Latest News