Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో ఒక సినిమా వేడుకకు హాజరు కాబోతున్నారు. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను రాజమహేంద్రవరంలోని సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు హైదరాబాదులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలలో ఏపీలోనే ఈ సినిమా వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం పై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్స్ చిరంజీవి నాగబాబు కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో ఈయన ప్రసంగం పైనే అందరూ ఆసక్తి చూపుతున్నారు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత జరపబోతున్న అతిపెద్ద ఈవెంట్ కావడంతో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తారని భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం రేవంత్ రెడ్డి సినిమాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏ సినిమాకి బెనిఫిట్ షోలు ఉండవని అదే విధంగా టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో నిర్మాతల చూపు ఆశలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం పైనే ఉన్నాయి. ఇక ఈ వేడుకలు పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఇదే అంశం గురించి ప్రస్తావిస్తారని ఆయన ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తారని పలువురు భావిస్తున్నారు.
ఇదే వేదికపై కొన్ని రకాల రాయితీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడం.. కష్టనష్టాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉండటం వల్ల ఇండస్ట్రీకి అనుకూలంగానే కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది. మరి పవన్ ఈ సినిమా ఎలాంటి ప్రకటనలు చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది.