టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయట కొన్ని సందర్భాలులో చాలా నెమ్మదిగా ఉంటారని అందరికీ తెలిసిందే. అలాగే సినిమాల పరంగా కూడా చాలా నెమ్మదిగానే ఉంటాడు కానీ తన రాజకీయ పరిస్థితులు బాగా భిన్నంగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు రాజకీయ పరంగా కూడా తన నిర్ణయాలు చేష్టలు మంచి ఆసక్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ మాదే వైజాగ్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి కొత్త పవన్ కనిపిస్తుండగా సోషల్ మీడియాలో కూడా తాను మరింత యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. అయితే రీసెంట్ గా పవన్ తన కొత్త ఎన్నికల ప్రచార వాహనం “వారాహి” అనే ఓ వాన్ ని అనౌన్స్ చేయగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.
దీనితో ఏపీలో పొలిటికల్ పరంగా అనేక విమర్శలు కూడా లేవనెత్తాయి. దీనితో ఇక ఈరోజు ఉదయం పవన్ తన ట్విట్టర్ నుంచి నా వారాహి కి ఉన్న రంగు చూసి చాలామంది అభ్యంతరం చెప్తున్నారు నేను కనీసం ఈ షర్ట్ అయినా వేసుకోవచ్చా అంటూ అదే రంగులో ఉన్న ఆర్మీ షర్ట్ ని తాను పోస్ట్ చేసాడు.
పైగా దానికి అదనంగా మొన్న వైజాగ్ లో కనీసం నన్ను బయటకి కూడా రానివ్వకుండా ఆంక్షలు పెట్టారు. ఇక నెక్స్ట్ ఏంటి నన్ను గాలి కూడా తీసుకోవద్దు అని చెప్తారా అంటూ ఓ రేంజ్ వెటకారంతో అయితే పవన్ ఈ పొద్దు పొద్దున్నే ట్విట్టర్ లో స్ట్రైక్ అయ్యారు. దీనితో ఈ ట్వీట్స్ మంచి వైరల్ అవుతున్నాయి.
1st you have stopped my films; in Visakhapatnam U didn’t let me come out of the vehicle & hotel room & forced me to leave the city. In Mangalagiri U didn’t let my car go out,then didn’t let me walk & now the color of vehicle has become an issue.OK,shall I stop breathing?? Next..
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022