Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అబ్బాయిలు సూపర్ అంటున్నారు, అమ్మాయిలు నో నో అంటున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తుండగా బోనీకపూర్ సమర్పిస్తున్నాడు. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తోంది. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ – శృతి హాసన్ ల రొమాంటిక్ పోస్టర్ .. టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.

అయితే ఈ మధ్య వకీల్ సాబ్ సినిమా విషయంలో ఒక న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో ఒక సాంగ్ యాడ్ చేయబోతున్నారని. వకీల్ సాబ్ లో మామూలుగానే సాంగ్స్ తక్కువ. దాంతో ఒక స్పెషల్ సాంగ్ ని పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమోగాని ఈ సాంగ్ లో మాత్రం తమన్నా స్టెప్పులేయబోతుందని వార్తలు మొదలయ్యాయి. గతంలో తమన్నా .. పవన్ కళ్యాణ్ తో కలిసి కెమెరామెన్ గంగ తో రాంబాబు సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

ఇక వకీల్ సాబ్ లో తమన్నా సాంగ్ ఉంటుందా లేదా అన్నది దర్శక, నిర్మాతలు క్లారిటీ ఇస్తే తెలుస్తుంది. తమన్నా ప్రస్తుతం యంగ్ హీరో సత్య దేవ్ తో గుర్తుందా శీతాకాలం అన్న సినిమా చేస్తోంది. అలాగే సక్సస్ ఫుల్ సినిమా ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 లో వెంకటేష్ కి జంటగా నటిస్తోంది. గోపీచంద్ హీరోగా వస్తున్న సీటీమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు నితిన్ నటిస్తున్న అంధాదున్ రీమేక్ లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. మధ్య మధ్యలో స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఒప్పుకుంటోంది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెల్సిందే. ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది.