పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సినిమాల్లో నెంబర్ వన్ హీరో. టాలీవుడ్ లో నెంబర్ వన్ పొజిషన్ ను కాదనుకొని రాజకీయాల్లోకి వెళ్లారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాల్లో ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఎంతమంది హీరోలు వచ్చినా టాలీవుడ్ లో పవన్ కల్యాణే నెంబర్ వన్ హీరో.
అసలు ఏ సినిమా స్టార్ కు కూడా లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కల్యాణ్ కు ఉంది. ఆయన్ను తన ఫ్యాన్స్ దేవుడిగా నమ్ముతారు. అయితే.. పవన్ కల్యాణ్ ఎక్కువగా ఆడంబరాలకు ఇష్టపడరు. అది అందరికీ తెలిసిన విషయమే.
తన బర్త్ డే వేడుకలను కూడా ఆయన పెద్దగా జరుపుకోరు. అది ఇప్పుడే కాదట.. చిన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్ బర్త్ డే వేడుకలకు దూరంగా ఉంటున్నారట. తన బర్త్ డే సందర్భంగా ఆయన తన చిన్ననాటి విషయాలను నెమరు వేసుకున్నారు.
చిన్నప్పటి నుంచి నాకు బర్త్ డేలు గట్రా చేసుకోవడం అలవాటు లేదు. ఒకటి రెండు సార్లు స్కూల్ లో చాక్లెట్లు పంచాను. అంతే. కొన్నిసార్లు అన్నయ్య దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఆ తర్వాత ఇక నా బర్త్ డేను నేనే మరిచిపోయేవాడిని. ఇంట్లో వాళ్లు కూడా మరిచిపోయేవాళ్లు. రెండుమూడు రోజుల తర్వాత ఎవరికైనా నా పుట్టిన రోజు గురించి గుర్తొస్తే.. వదిన నాకు కొన్ని డబ్బులు ఇస్తే.. వాటితో కొన్ని పుస్తకాలను కొనుక్కునేవాడిని. అంతే.. అంతకు మించి నా బర్త్ డేను ఏదో ప్రత్యేకంగా జరుపుకున్న రోజులైతే లేవు. సినిమాల్లో నటించడం మొదలు పెట్టాక… నా ఫ్రెండ్స్, నిర్మాతలు, డైరెక్టర్లు… నా పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తుండేవాళ్లు. కేక్ కట్ చేసి నా నోట్లో పెట్టడం నాకు కొంచెం ఇబ్బందిగానే అనిపించేది. దీంతో అప్పటి నుంచి నా బర్త్ డే వేడుకలకు దూరంగా ఉంటున్నాను. అంతకు మించి.. నా బర్త్ డే జరుపుకోకపోవడానికి పెద్దగా ఇంకేం కారణాలు లేవు..అంటూ పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఇక.. ఇవాళ పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన టీజర్ ఉదయం 9 గంటలకు, క్రిష్ సినిమా అప్ డేట్ మధ్యాహ్నం 12.30 కు, హరీశ్ శంకర్ సినిమా అప్ డేట్ సాయంత్రం 4 గంటలకు రానున్నాయి.