పాన్ ఇండియా హీరో రేంజ్ లో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్..?

మెగా కుటుంబం నుండి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మెగా కుటుంబం నుండి ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకొని పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ పరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయ కార్యకలాపాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయటానికి పార్టీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ప్రజల క్షేమం కోసమే ఆరాటపడుతూ ఉంటాడు.

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ పనులతో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా “భగవతీయుడు భగత్ సింగ్” అనే సినిమా కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాలు ఇంకా పూర్తికాకముందే పవన్ కళ్యాణ్ మరొక సినిమానే లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.

సాహో సినిమా దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించటానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా డివివి దానయ్య నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకునె రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా 70 కోట్ల రూపాయలు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి పాన్ ఇండియా హీరోలతో సమానంగా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ అందుకోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.