Anchor Suma : సుమ నటించిన ” జయమ్మ పంచాయితీ ” సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన పవర్ స్టార్…!

Anchor Suma : తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరమే లేదు.యాంకర్‌గా పలు టీవీ షోస్, ఇంటర్వ్యూస్, సినిమా ఆడియో ఫంక్షన్స్ , ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ ఈవెంట్స్ అంటూ క్షణం తీరిక లేకుండా వుంటారు సుమ. అంతే కాదు ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏదో ఒక ఛానల్ లో సుమ ప్రోగ్రాం వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా అభిమానులకు కనెక్ట్ అయ్యారు యాంకర్ సుమ.

అయితే సుమ ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం హీరోయిన్‌గా ఓ సినిమా చేశారు.కానీ తరువాత సినిమాలో హీరోయిన్ గా నటించలేదు.అయితే అడపా దడపా కొన్ని సినిమాలలో చిన్ని చిన్ని పాత్రలో కనిపించరు. కానీ ఇప్పుడు జయమ్మ పంచాయితీ సినిమాతో ఒక విభిన్నమైనా కథ తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నారు.

ఇప్పటికే ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం నుంచి సుమ ఫస్ట్ లుక్ వచ్చి ఆకట్టుకోగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. విజయ్ కుమార్ కలివరపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘జయమ్మ పంచాయితీ’ చిత్రం నుంచి వచ్చిన సుమ ఫస్ట్ లుక్ కు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మే 6, 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.