టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు భారీ చిత్రాలు మరియు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు సహా పాలిటిక్స్ కి కూడా చిన్న బ్రేక్ ఇచ్చి తన మేనల్లుడు వరుణ్ తేజ్ పెళ్లి కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.
మరి ఇప్పుడు ఇటలీలో బిజీగా ఉన్న పవన్ పాలిటిక్స్ లో ఈ ఏడాది ప్రముఖ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. మరి చంద్రబాబు అరెస్ట్ తో అయితే ఒకసారిగా ఏపీలో పరిస్థితులు మారగా ఇవాళ తాను బైలు మీద బయటకి వస్తున్నట్టుగా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.
మరి ఈ విడుదలపై అయితే పవన్ కళ్యాణ్ కూడా ఓ అఫీషియల్ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం వైరల్ గా మారింది. కాగా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి అంటూ హెడింగ్ పెట్టి చంద్రబాబు కి మధ్యంతర బెయిల్ రావడం సంతోషంగా ఉందని ఆయన మరింత ఉత్సాహంతో ప్రజాసేవకు రావాలని తాను కోరుకుంటున్నాను అని తెలిపాడు.
అంతే కాకుండా చంద్రబాబు విడుదల కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఆయన్ని అందరూ స్వాగతిద్దాం అంటూ ప్రెస్ నోట్ విడుదల చేసి హీరో మరియు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ తన స్పందన తెలియజేసాడు దీనితో ఈ ప్రెస్ నోట్ ఇపుడు వైరల్ గా మారింది.
https://x.com/JanaSenaParty/status/1719255659865075892?s=20