నితిన్ కొత్త సినిమా టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఇదే ..!

నితిన్.. టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫాం లో ఉన్నాడు. భీష్మ సినిమాతో చాలా కాలానికి సక్సస్ ట్రాక్ ఎక్కిన నితిన్ ఇక ఎలాంటి పరిస్థితిలోను మళ్ళీ ఫ్లాప్ రాకూడదని కసిగా మంచి కథలని ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కో కథ ని చాలా రకాలుగా ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాని కంప్లీట్ చేశాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. కాగా మార్చ్ 26 న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు నితిన్.

Nithin in Check : నితిన్ కొత్త సినిమా టైటిల్ | జాతీయం News in Telugu

అలాగే పవర్ పేట సినిమాతో పాటు చెక్ అనే సినిమాను లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చెక్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలని తెరకెక్కించి టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు తాజాగా చంద్రశేఖర్ యేలేటి నుంచి వచ్చిన చెక్ టీజర్ తో మరోసారి తన టాలెంట్ ని చూపించబోతున్నాడు.

తాజాగా చెక్ టీజర్ రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటోంది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మార్క్ తో చెక్ కూడా తెరకెక్కుతుందని మళ్ళీ అనుకునేలా చేశాడు. చెక్ టీజర్ లో హీరో నితిన్ జైలులో ఖైదీగా పరిచయం చేసాడు. జైల్లో ఖైదీగా ఉన్న హీరో చెస్ ఆటలో ఆరితేరిన వాడని.. ఒక ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు. అంటే విశ్వనాధ్ ఆనంద్ లా మాటలతో టీజర్ మొదలై చాలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. అయితే నితిన్ పవన్ కళ్యాణ్ కి డై హార్ట్ అన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా నితిన్ నటించిన చెక్ టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ … పొగడ్తలతో ముంచేశాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మాటలకి నితిన్ చాలా ఎగ్జైట్ అవుతున్నాడట. అంతేకాదు ఈ సినిమా నితిన్ కి పక్కా బ్లాక్ బస్టర్ ఇవ్వబోతోందని పవన్ కళ్యాణ్ రియాక్షన్ చూస్తేనే అర్థమవుతుందని చెపుకుంటున్నారు.