హరీష్ శంకర్‌ని అయోమయంలో పడేసిన ‘ఉస్తాద్’.!

‘భగత్ సింగ్’ పేరుని హరీష్ శంకర్ తన సినిమా టైటిల్‌గా ఏ ముహూర్తాన ఫిక్స్ చేశాడోగానీ, ఆ సినిమా ముందుకు కదలడానికి చాలా చాలా తంటాలు పడుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఎలాగో ‘బ్రో’ సినిమాని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ‘హరిహర వీరమల్లు’ని జంక్షన్‌లో వదిలేసినట్లే కనిపిస్తోంది. ఇక, ‘భగత్ సింగ్’ పరిస్థితి మరీ దారుణం. ‘భవదీయుడు భగత్ సింగ్’ కాస్తా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయినా, వ్యవహారం ముందుకు నడవడంలేదు సాఫీగా.

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీ అయిపోవడం వల్ల ‘ఉస్తాద్’ వ్యవహారం పక్కు వెళ్ళింది. ‘ఓజీ’నే కాస్త బెటర్.. షూటింగ్ కాస్త గట్టిగానే జరిగినట్టుంది. ‘ఉస్తాద్’ ఆగిపోతుందా.? ముందుకెళుతుందా.? ఏమో, హరీష్ శంకర్‌కే అర్థం కాని పరిస్థితి.

ఓ పది రోజుల తర్వాతగానీ, ‘ఉస్తాద్’ గురించి హరీష్ శంకర్ పెదవి విప్పలేడు.! అప్పటికి ‘వారాహి యాత్ర’ తాలూకు ఫస్ట్ సెషన్ పవన్ కళ్యాణ్ పూర్తి చేసుకుంటారు.