రవితేజతో హరీష్ శంకర్ ఓ సినిమా చేయాల్సి వుంది. అయితే, పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తయ్యాకే ఆ సినిమాని టచ్ చేస్తానని హరీష్ శంకర్ చెప్పాడు. కానీ, సంక్రాంతికి అంటే జనవరిలో రవితేజ సినిమా స్టార్ట్ అవుతుందంటూ తాజాగా ఓ ప్రచారం తెరపైకి వచ్చింది.
దాంతో, హరీష్ శంకర్ కంగారు పడ్డాడు. ఆ వార్తను వెంటనే ఖండించే ప్రయత్నం చేశాడు. రవితేజ సినిమాని స్టార్ట్ చేసి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ని హరీష్ శంకర్ పక్కన పెట్టేస్తాడట.. అనేది ఈ ప్రచారం తాలూకు సారాంశం. కానీ, అదంతా ఫేక్ ప్రచారం అని హరీష్ శంకర్ కొట్టి పడేశాడు.
అది ఫేక్ అన్నాడు. కానీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్టేటస్ ఏంటీ.? అని మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతున్నాడు హరీష్ శంకర్. ఇంతవరకూ కేవలం 20 రోజులు మాత్రమే షూటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో హరీష్ నుంచి క్లారిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ, ఆ క్లారిటీ దొరకడం లేదు.
పవన్ కళ్యాణ్‌తో సినిమా కాబట్టే.. హరీష్ శంకర్ ఇలాంటి ఇరకాటాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. లేదంటే, ఆయన అభిప్రాయాలు మరోలా వుండేవి. హరీష్ శంకర్ ఒక్కడే కాదు.. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్న క్రిష్ జాగర్లమూడి, అటు సుజిత్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది.
మింగలేక, కక్కలేక అన్న చందంగా వుంది వీరి పరిస్థితి. ‘ఓజీ’ దాదాపు పూర్తయ్యింది. కానీ, క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం పరిస్థితి ఏంటో ఎవ్వరికీ తెలీదు. అగమ్యగోచరంగానే వుంది దాని పరిస్థితి కూడా. చూడాలి మరి, అలాగట ఇలాగట.. అంటూ జరుగుతున్న ఈ ఫేక్ ప్రచారాల్ని ఈ డైరెక్టర్లు ఎలా ఫేస్ చేస్తారో.!