ప్రశంసలు కురిపించిన పవన్ కళ్యాణ్… సంతోషంలో యంగ్ హీరో?

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిఖిల్ సిద్ధార్థ్ ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాలలో నటించాడు. ఇటీవల నిఖిల్ నటించిన కార్తికేయ2 సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదట ఈ సినిమా విడుదల చేయటానికి థియేటర్స్ దొరక్క ఇబ్బంది పడ్డ నిర్మాతలు ఈ సినిమా విజయంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై పాన్ ఇండియా హిట్ అందుకుంది.

గతంలో నిఖిల్ నటించిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించారు. అడ్వెంచర్స్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినీ ప్రముఖులను కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో పలువురు సెలబ్రిటీలు ఈ సినిమా మీద ప్రశంసలకు కురిపించారు. ఇప్పటికే ప్రభాస్ లాంటి బడా హీరోలు కార్తీకేయ 2 సినిమా గురించి ప్రశంసిస్తూ కార్తికేయ టీమ్ ను అభినందించారు. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కార్తికేయ 2 సినిమా గురించి మాట్లాడారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్తికేయ 2 సినిమా గురించి మాట్లాడుతూ.. ఇటీవల కార్తీకేయ అనే సినిమా వచ్చి దేశమంతా దుమ్ము దులిపేస్తుంది. నేను మార్పు రావాలని కోరుకుంటాను. నేను కోరుకునే మార్పు అంటే ఇదే అని అన్నారు. పవన్ కళ్యాణ్ తమ సినిమా గురించి పొగడటంతో కార్తికేయ సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఈ వీడియోను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదట కొన్ని థియేటర్లలో మాత్రమే విడుదల అయింది. అయితే సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా అధిక సంఖ్యలో థియేటర్లలో రన్ అవుతుంది.