ఆ సినిమా కోసం పవన్ కఠినమైన డైట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు తెలియని భారతీయులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాల్లో బిజీగా దూసుకుపోతున్న ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన చెప్పే డైలాగ్ లు, చేసే యాక్షన్ కు పడి చచ్చిపోతుంటారు. ఆయన సినిమా వస్తుందని అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల ఎక్కువగా రీమేక్ చిత్రాల్లో నటించేందుకే పవన్ కల్యాణ్ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆయన తన అల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.

రవితేజతో శంభో శివ శంభో సినిమా తీసిన డైరెక్టర్ సముద్రఖని తాజాగా పవర్ స్టార్ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా తమిళ హిట్ వినోదయ సీతమ్ చిత్రానికి రీమేక్. అయితే ఒరిజినల్ సినిమా తీసిన సముద్ర ఖనియే తెలుగులో కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఇందులోని పాత్ర కోసం పవన్ కల్యాణ్ సెపరేట్ గా డైట్ ఫాలో అవుతున్నారట. స్లిమ్ గా కనిపించాలని జిమ్ లో కసరత్తులు కూడా చేస్తున్నట్లు సమాచారం. రాజకీయాలు, సినిమాల వల్ల ఆయనకు జిమ్ లో గడిపేందుకు ఎక్కువ సమయం దొరక్క కాస్త బొద్దుగా తయారయ్యారు. ఈ చిత్రంలోనే పాత్ర కోసం మళ్లీ సన్నగా మారబోతున్నారు.

 

అయితే సాయ్ ధరమ్ తేజ్, పవన్ కలిసి నటించబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజున ప్రారంభం కాబోతుంది. కారు యాక్సిడెంట్ లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడమనేది వినోదయ సీతమ్ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కనిపించబోతుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు.

ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ నటిస్తుండగా… పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే కాకుండా పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భగవదీయుడు భగత్ సింగ్, సుజిత్ డైరెక్షన్ లో రాబోతున్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) షూటింగ్ లు కూడా రీమేక్ చిత్రాలే కావడం గమనార్హం.