పవన్ OG మరీ అంత ఆలస్యమా?

పవన్ కళ్యాణ్ OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాహో దర్శకుడు సుజిత్ తెరపైకి తీసుకు రానున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చి షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.

ఇక చిత్ర యూనిట్ రిలీజ్ విషయంలో మాత్రం చాలా టైమ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇది నిజంగా చాలా ఎక్కువ టైమ్ అని ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు. ఇక మరోవైపు పవన్ భవదియుడు భగత్ సింగ్ సినిమాను కూడా OG ప్రాజెక్ట్ తో పాటు ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక మరోవైపు హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాది రావాల్సి ఉంది. బహుశా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కాస్త గ్యాప్ ఉండాలి పవన్ ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువగా OG సినిమాపైనే ఉంది. దాన్నే వీలైనంత త్వరగా విడుదల చేస్తే బెటర్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో నిర్మాత DVV దానయ్య ఎలా ఆలోచిస్తారో చూడాలి.

ఇక పవన్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో వినోదాయ సీతమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా మాత్రం ఇదే ఏడాది రావచ్చని తెలుస్తోంది. అలాగే మరో మేనల్లుడు వైష్ణవ్ తో కూడా పవన్ మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నాడు. ఆ సినిమా కథ, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక యువ దర్శకుడు సుధీర్ వర్మ ఆ కథకు దర్శకత్వం వహించనున్నాడు.