మార్చి 14న పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుక కోసం జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు చాలా బిజీగా కనిపంచాడు. ఇక ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించారు. అయితే, ప్రత్యేక సమాచారం ప్రకారం పాలోటిక్స్ అనంతరం పవన్ “వినోదయ సీతం” రీమేక్ యొక్క మిగిలిన భాగాలను పూర్తి చేయడానికి సిద్ధం కానున్నాడు.
అంతేకాకుండా, వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ రాబోయే రెండు సినిమాల షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. మొదటిది, “OG” పేరుతో ముంబయి బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని షెడ్యూల్స్ జపాన్‌లో సెట్ చేయబడ్డాయి.
ఈ చిత్ర దర్శకుడు సుజీత్ ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ని సిద్ధం చేసి, వీలైనంత త్వరగా షూటింగ్‌ని పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ని సిద్ధం చేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఇక “ఓజీ”తో పాటు పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ కూడా వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.
సామాజిక అంశాలను హైలైట్ చేసే సాంఘిక డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే హరిహర వీరమల్లు కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. ఇక రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి అభిమానులు ఆతృతగా ఉన్నారు. మరి ఆ సినిమాలు పవన్ స్థాయిని ఏ రేంజ్ కు పెంచుతాయో చూడాలి.