Pawan Kalyan: టాలీవుడ్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నారని చెప్పాలి. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అలా ప్రస్తుతం రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యంగా తన సినిమా చిత్రీ కరణలని చకచగా పరుగులు పెట్టిస్తున్నారు. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొనడంతో పాటు చకచగా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. ఓజీ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ కమిట్ అయినా మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాను కూడా మళ్లీ మొదలు పెట్టబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అశుతోశ్ రాణా, నవాబ్ షా, గౌతమి లాంటి సెలబ్రిటీలు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల రెండో వారం నుంచి తిరిగి మళ్ళీ మొదలు కానుంది. ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ మంగళవారం తిరుపతిలో వెల్లడించారు.
ఈ షెడ్యూల్ మొదలైన కొద్ది రోజుల్లోనే పవన్ కూడా ఈ చిత్ర సెట్లోకి అడుగు పెడతారని టాక్. ఇది అన్ని రకాల వాణిజ్య హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా సిద్ధమవుతోంది. పవన్ ఇందులో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో అలరించనున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్ మీద ఇలా వరుసగా సినిమాలన్నీ పూర్తి చేస్తూ ఉండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.