పుష్ప కోసం పవర్ స్టార్.. తప్పుకోక తప్పలేదు

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత ఒక స్పెషల్ మూమెంట్ చోటు చేసుకుంది. ఏకధాటిగా ఒకేరోజు వడగండ్ల వర్షం పడ్డట్లు రిలీజ్ డేట్స్ ను వదిలారు. ఒకటి ఎనౌన్స్ చేసేలోపే మరొక సినిమా రిలీజ్ పోస్టర్ ను విడుదల చేయడం అందరిని షాక్ కు గురి చేసింది. అయితే పుష్ప రిలీజ్ డేట్ పై అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదట.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ విషయంలో గత వారం నుంచి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ లో పెద్ద సినిమాలతో ఫొటి లేకుండా ఉంటేనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు సీతారా ఎంటర్టైన్మెంట్ వారు.

అయ్యప్పనుమ్ కొశీయుమ్ ను తెలుగులో రీమేక్ ను ఇటీవల స్టార్ట్ చేసిన పవర్ స్టార్ ఆ సినిమాను ఆగస్ట్ 15లోపు రిలీజ్ చేయాలని అనుకున్నారట. అయితే ఆ డేట్ కోసం పుష్ప టీమ్ కూడా ఆలోచిస్తుండడంతో దర్శకుడు సుకుమార్ హీరో బన్నీ, నిర్మాతలతో అలాగే త్రివిక్రమ్ తో కలిసి చర్చించారట. పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలో పెద్దగా అభ్యంతరం చెప్పలేదట. ఇక బన్నీ కోసమే పవన్ తన సినిమాను వినాయకచవితికి షిఫ్ట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇది ఎంతవరకు నిజమో తెలియాలి మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.