పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారో లేదో.!

ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల్లోంచే కొన్నిటిని తాత్కాలికంగా పక్కన పెట్టక తప్పని పరిస్థితి.! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే ఇదంతా.!

‘హరిహర వీరమల్లు’ సోదిలోకి లేకుండా పోయింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటో తెలియదు. ఇప్పటికైతే విడుదలకు సిద్ధమైన ‘బ్రో’ హోరు కొనసాగుతోంది. ఆ తర్వాత ‘ఓజీ’ పూర్తవ్వాల్సి వుంది.

ఇంతలోనే, కొత్త సినిమా గురించిన ప్రచారాలు చాలానే తెరపైకొస్తున్నాయ్. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ వీలైతే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పూర్తి చేయాలనీ, కుదిరితే ‘హరిహర వీరమల్లు’నీ పూర్తి చేయాలనుకుంటున్నారట.

ఇవి కాకుండా కొత్త ఆలోచనలైతే పవన్ కళ్యాణ్ ఏమీ చేయడంలేదు. అయితే, తాజాగా తమిళ సినిమా నుంచి ఓ ఆఫర్ వచ్చిందట పవన్ కళ్యాణ్ దగ్గరకి.

ఓ ప్రముఖ తమిళ హీరో, గెస్ట్ రోల్ ఒకటి తన సినిమాలో చేయాలని పవన్ కళ్యాణ్‌ని అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత ఒకరు మీడియేటింగ్ చేస్తున్నారని సమాచారం.

ఓ వారం పదిరోజులు డేట్స్ ఇస్తే చాలంటున్నారట. కానీ, పవన్ అందుకు సుముఖంగా లేరని తెలిసింది.