అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలకు సైన్ చేస్తాడు.? వాటిల్లో ఎన్ని సెట్స్ మీదకు వెళతాయి.? ఇలా చాలా డౌట్స్ వున్నాయ్. కానీ, పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుపోతున్నాడు.
పోటీ చేసే నియోజకవర్గంపై జనసేనాని పవన్ కళ్యాణ్‌కి స్పష్టత లేదుగానీ, చేయబోయే సినిమాల గురించి మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి పూర్తి స్పష్టత వున్నట్లే కనిపిస్తోంది. రాజకీయాల కంటే సినిమాలకే పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తుండడం ఆశ్చర్యకరమే.
‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్స్ మీద వుంది. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఓ రీమేక్ సినిమా (‘వినోదియ సితం’) ప్రారంభం కానుంది.
ఇంతలోనే, ఇంట్రెస్టింగ్ గాసిప్ చక్కర్లు కొడుతోంది సినీ వర్గాల్లో. దర్శకుడు సంపత్ నంది, పవన్ కళ్యాణ్‌ని ఇటీవల కలిసి, కథ చెప్పి.. ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడన్నది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
‘రచ్చ’ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తెరకెక్కించిన సంపత్ నంది, పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాని సంపత్ నంది మిస్ అయిన సంగతి తెలిసిందే.