ప్రదీప్ మాచిరాజు బుల్లితెర మీద టాప్ యాంకర్ గా పరిణితి చెంది … యాక్టర్ గా, టెలివిజన్ ప్రొడ్యూసర్ గా కూడా దూసుకుపోతూ తాజాగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో హీరోగా కూడా అవతారమెత్తాడు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించి తోలి సినిమాతోనే విజయం అందించడంతో ప్రదీప్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో ప్రసారమయ్యే “కొంచెం టచ్ లో ఉంటే చెప్తా” షో ని ప్రదీప్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 5వ సీజన్ త్వరలోనే ప్రారంభించే పనిలో ప్రదీప్ ఉన్నాడు.
అయితే స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన ప్రదీప్ ఈ షోకు పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నాడు. సీజన్ 5 లో తోలి ఎపిసోడ్ లో పవర్ స్టార్ ని ఇంటర్వ్యూ చేసి ఈ సీజన్ ని ఘనంగా ఆరంభించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మేరకు రీసెంట్ గా పవర్ స్టార్ ని ప్రదీప్ కలిసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసి మరో రెండు సినిమాలను ఒకేసారి చేస్తూ, మరోవైపు రాజకీయ కార్యక్రమాలను చూసుకుంటూ పవన్ బాగా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ప్రదీప్ కోరికను తీర్చటానికి పవన్ అంగీకరించారని సమాచారం. ప్రదీప్ కి ఈ ఇయర్ బాగా కలిసొస్తున్నట్లుంది.