టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సినిమాల షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న పీరియాడిక్ డ్రామా ‘హరి హర వీరమల్లు’.
రాజకీయపరమైన బిజీ షెడ్యూల్ మధ్య లాంగ్ టైం పెండింగ్ వర్క్ కోసం కొన్ని గంటలు.. అంటూ సోషల్ మీడియా ద్వారా ఫొటోషూట్‌లో పాల్గొన్న విషయాన్ని షేర్ చేశాడు పవన్ కల్యాణ్. ఇప్పటిదాకా చేసిన వాటి కంటే ఈ ఫొటోషూట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే తాజా షూట్ కోసం భారతీయ తొలి పొటోమెట్రిక్ 3 డీ స్కానింగ్ టెక్నాలజీ వినియోగించారు. షూట్‌కు ముందు ఓ సెల్ఫీ కూడా దిగాడు పవన్ కల్యాణ్. రౌండప్ చేసిన లైట్లు, కెమెరాల మధ్య మీసం మెలేస్తున్న హరిహరవీరమల్లు విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ త్వరలోనే కొత్త షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.