పవన్ కళ్యాణ్ మూడు నెలలు సినిమాకి కేటాయిస్తే.!

ఎలక్షన్లు దగ్గరకొచ్చేస్తున్నాయ్. పవన్ కళ్యాణ్‌కి ఓ పక్క సినిమాలూ, మరో పక్క రాజకీయాలూ.. ఒత్తిడి పెరిగిపోతోందట. అయినా, ఆయనపై ఎలాంటి ఒత్తిడీ లేకుండా దర్శక, నిర్మాతలు జాగ్రత్తపడుతున్నారట.

ఆయన కాస్త ఫోకస్ ఇస్తే చాలు, రెండు సినిమాలూ పూర్తి చేసేస్తామనీ నమ్మకంగా చెబుతున్నారట ఇటు సుజిత్ కానీ, అటు హరీష్ శంకర్. సుజిత్ రూపొందిస్తున్న ‘ఓజీ’ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఓ 20 రోజులు కేటాయిస్తే, ఈ సినిమా పూర్తియిపోతుంది. ఇక, మిగిలింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాకి 55 రోజులు టైమ్ కేటాయించమని హరీష్ శంకర్ కోరుతున్నాడట.

అదీ, ఇదీ.. ఎలా చూసుకున్నా ఈ లెక్కన మూడు నెలలు ఖచ్చితంగా కేటాయించాల్సిందే పవన్ కళ్యాణ్. అయితే, ఎలాగైనా పూర్తి చేయాలన్న కసి మీదే పవన్ కూడా వున్నారట. అందుకే హరీష్ శంకర్, సుజిత్ ఓ నిర్ణయానికి వచ్చారట. మ్యూచువల్ ప్లానింగ్‌తో సినిమాలు పూర్తి చేసేద్దామనుకుంటున్నారట. అలాగే, నిర్మాణ సంస్థలు కూడా పరస్పర అవగాహనతో ఓ ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారనీ తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ నుంచి మళ్లీ షూటింగులు ప్రారంభం కానున్నాయనీ తెలుస్తోంది. అయితే, పొలిటికల్ కమిట్మెంట్లు పక్కన పెట్టి పూర్తిగా సినిమాలకు టైమ్ కేటాయించడానికి పవన్ కళ్యాణ్‌కి పరిస్థితులు అనుకూలిస్తాయా.? చూడాలి మరి.