పవన్ రెమ్యునరేషన్ మళ్లీ పెరిగిందా !

Pawan Kalyan hikes his remenuration again

Pawan Kalyan hikes his remenuration again

టాలీవుడ్లో అత్యధిక పారితోషకం పుచ్చుకుంటున్న హీరో ఎవరు అంటే అనుమానం లేకుండా పవన్ కళ్యాణే అనవచ్చు. రీఎంట్రీలో పవన్ పక్కా కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఇన్నాళ్లు తన స్టార్ డమ్, మార్కెట్ గురించి పట్టించుకోకుండా సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు మాత్రం క్రేజుకు తగ్గట్టే పారితోషకం పుచ్చుకుంటున్నారు. వరుసపెట్టి డేట్స్ ఇస్తుండటంతో నిర్మాతలు చాలామంది ఆయన కోసం క్యూకడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పవన్ రోజువారీ రెమ్యునరేషన్ కింద రోజుకు కోటి రూపాయల వరకు తీసుకునేవారు. అంటే ఎన్ని రోజులు షూటింగ్ చేస్తే అన్ని కోట్లన్నమాట.

అయితే ఇప్పుడు అది కూడ పెరిగిందని తెలుస్తోంది. పవన్ మొదలుపెట్టిన రెండు సినిమాలు మధ్యలో ఉన్నాయి. త్వరలోనే వీటి షూటింగ్ రీస్టార్ట్ కానుంది. లాక్ డౌన్ వలన ఆలస్యం కావడంతో వీలైనంత త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని చూస్తున్నారు. అంటే 10 రోజుల్లో చేయాల్సిన షెడ్యూల్ వారం రోజుల్లోనే చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కి తెలిపారట కూడ. పవన్ సైతం వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పారితోషకం కొద్దిగా పెంచుతున్నట్టు క్లారిటీ ఇచ్చారట. అంటే రోజుకి కోటి కాస్త కోటి 15 లక్షల నుండి కోటి 20 లక్షల వరకు పెరిగి ఉండొచ్చట. షూటింగ్ త్వరగా పూర్తవుతుంది కాబట్టి నిర్మాతలు సైతం పబన్ చెప్పిన మొత్తానికి తలా ఊపేస్తున్నారు.